టైటిల్‌ పోరుకు పేస్‌ జోడీ  | Leander Paes And Matthew Abden Pair Enters Final | Sakshi
Sakshi News home page

టైటిల్‌ పోరుకు పేస్‌ జోడీ 

Feb 15 2020 10:05 AM | Updated on Feb 15 2020 10:05 AM

Leander Paes And Matthew Abden Pair Enters Final - Sakshi

బెంగళూరు: ఈ ఏడాదిలో రిటైర్‌ కానున్న భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ బెంగళూరు ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో ఫైనల్‌కు చేరాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పేస్‌ (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) ద్వయం 6–4, 3–6, 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో జొనాథన్‌ ఎల్రిచ్‌ (ఇజ్రాయెల్‌)–ఆండ్రీ వాసిలెవ్‌స్కీ (బెలారస్‌) జోడీపై గెలిచింది.

80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సరీ్వస్‌లను ఒక్కోసారి కోల్పోయాయి. అయితే సూపర్‌ టైబ్రేక్‌లో మాత్రం పేస్‌ జంట పైచేయి సాధించి ఫైనల్‌కు చేరింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement