అదొక స్పెషల్‌ ఫీలింగ్‌.. సెకండ్‌ డ్రీమ్‌: రాహుల్‌

Leading Oour Country Is Always Second Dream, KL Rahul - Sakshi

మౌంట్‌మాంగని: ఒక జట్టుగా సమిష్టిగా రాణించడమే తమ ముందున్న లక్ష్యమని టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ పేర్కొన్నాడు. తాము విజయాలు సాధించడంపైనే దృష్టి పెడతామని, ఇక్కడ జూనియర్లు, సీనియర్లు అనే తేడాలు ఉండవన్నాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20ని సైతం టీమిండియా కైవసం చేసుకుని 5-0 క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు అందుకునే క్రమంలో మాట్లాడుతూ..  అంతా కలిసి కట్టుగా ఆడటంతోనే ,  ఒత్తిడిని కూడా ఎదుర్కొని విజయాలు సాధిస్తున్నామన్నాడు. (ఇక్కడ చదవండి: కోహ్లికి రెస్ట్‌.. రోహిత్‌కు ఛాన్స్‌)

‘రెండు-మూడేళ్లుగా మా జట్టు ఇంటా బయటా అద్భుత విజయాలు నమోదు చేస్తుంది. ఇది సమిష్టి కృషి. ఇందులో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేదు. మా డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూడా ఎటువంటి బేధాలు కూడా ఉండవు. తామంతా కలిసి విజయం కోసం మాత్రమే చర్చిస్తాం. విదేశాల్లో 5-0 తేడాతో సిరీస్‌ గెలవడం అంటే అది చాలా అరుదు. అది ఇప్పుడు సాధ్యమైంది. ఈ సిరీస్‌ విజయాన్ని ఆస్వాదిస్తూ వన్డే పోరుకు సన్నద్ధమవుతాం. మా కెప్టెన్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు ఫీల్డ్‌లో లేనప్పుడు ఎలా స్పందిస్తామో కూడా చూడాలనుకున్నాం. నేను కెప్టెన్‌గా వ్యవహరించాను. నేను కెప్టెన్‌గా చేసినా అంతా విజయంలో భాగమయ్యారు.

దేశం తరఫున క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించడం అదొక స్పెషల్‌ ఫీలింగ్‌.  ఎవరికైనా దేశానికి సారథ్యం వహించడమంటే సెకండ్‌ డ్రీమ్‌ అవుతుంది. మొదటిది ఎలాగూ దేశం తరఫున ఆడటం అనేదే ఉంటుంది. ఆ మ్యాచ్‌లో రోహిత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు గాయం కావడం దురదృష్టకరం. నేను ప్రతీరోజూ లేచిన తర్వాత క్రికెట్‌ ఆడతాను. కొత్త చాలెంజ్‌లను స్వీకరిస్తాను’ అని రాహుల్‌ తెలిపాడు. కివీస్‌తో చివరి టీ20కి కోహ్లికి విశ్రాంతినిస్తే, రోహిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చారు. కాగా, బ్యాటింగ్‌ చేస్తున్న క‍్రమంలో రోహిత్‌ గాయపడటంతో రిటైర్డ్‌హర్ట్‌ అయ్యాడు. దాంతో భారత్‌ ఫీల్డింగ్‌ చేసేటప్పుడు రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. (ఇక్కడ చదవండి: నెవర్‌ బిఫోర్‌... 5-0)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top