టాస్‌ గెలిచిన కిం‍గ్స్‌ పంజాబ్‌ | KXIP Won The Toss And Elected To Field | Sakshi
Sakshi News home page

Apr 8 2018 4:00 PM | Updated on Apr 8 2018 4:02 PM

KXIP Won The Toss And Elected To Field - Sakshi

టాస్‌ వేస్తున్న అశ్విన్‌

మొహాలీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌లో భాగంగా ఇక్కడ ఆదివారం ఐఎస్‌ బింద్రా స్టేడియంలో ఢిల్లీడేర్‌ డేవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇరు జట్లు తొలి విజయం కోసం ఉవ్విళ్లురుతున్నాయి. అశ్విన్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌కాగా.. సొంత గూటి చేరిన గంభీర్‌ ఎలాగైన విజయాన్నందించాలని భావిస్తున్నాడు. మేటి ఆటగాళ్లతో ఇరు జట్లు సమిష్టిగా ఉన్నాయి.

తుది జట్లు:
పంజాబ్‌ : కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, యువరాజ్‌ సింగ్‌, డేవిడ్‌ మిల్లర్‌, మార్కస్‌ స్టోయినీస్‌, అక్సర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్(కెప్టెన్‌), ఆండ్రూ టై, మోహిత్‌ శర్మ, రెహ్మాన్‌

ఢిల్లీ: గౌతం గంభీర్‌ (కెప్టెన్‌), కోలిన్‌ మున్రో, రిషబ్‌పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, క్రిస్‌ మొర్రిస్‌, విజయ్‌ శంకర్‌, డానియల్‌ క్రిస్టియన్‌, అమిత్‌ మిశ్రా, రాహుల్‌ తెవాటియా, ట్రెంట్‌ బోల్ట్‌, మహ్మద్‌ షమీ

Advertisement
 
Advertisement
Advertisement