ఆ ముగ్గురి చలవే..! 

Kumble and Dravid Fight for Revenue Share Benefitting Current Cricketers  - Sakshi

భారత క్రికెటర్లకు డబ్బులొచ్చాయన్న సెహ్వాగ్‌ 

న్యూఢిల్లీ: భారత క్రికెటర్లకు ఇప్పుడు లభిస్తున్న డబ్బు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 2001–02లో పరిస్థితి ఇలా లేదని, ముగ్గురు దిగ్గజ క్రికెటర్ల పోరాటం వల్లే అది సాధ్యమైందని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. అప్పట్లో అధికారికంగా ప్లేయర్స్‌ అసోసియేషన్‌ లేకపోయినా... సచిన్, ద్రవిడ్, కుంబ్లే బోర్డు ఆదాయంలో ఆటగాళ్లకు వాటా ఉండాలంటూ పోరాడారని సెహ్వాగ్‌ గుర్తు చేసుకున్నాడు. ‘దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఆదాయంనుంచి మా వాటా తీసుకునేందుకు బీసీసీఐతో పోరాడాల్సి వచ్చింది. నాడు సచిన్, ద్రవిడ్, కుంబ్లే మా హక్కుల కోసం నిలదీయకుండా ఉంటే ఈ రోజు పరిస్థితి భిన్నంగా ఉండేదేమో.ఇంత చేసినా అప్పట్లో ఆటగాళ్ల మధ్య విభేదాలు గానీ తిరుగుబాటు గానీ రాలేదనే విషయం కూడా మరచిపోవద్దు’ అని వీరూ గుర్తు చేసుకున్నాడు. 
  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top