మూడే మూడు నిమిషాల్లో ఒప్పించా: గంగూలీ

Kohli Took Three Seconds To Agree For Day Night Test Says Ganguly - Sakshi

న్యూఢిల్లీ:  డే అండ్‌ నైట్‌ టెస్టు కోసం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని మూడు నిమిషాల్లోనే ఒప్పించాడట బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ.  ఈ విషయాన్ని దాదానే స్వయంగా తెలిపాడు. కొన్నేళ్లుగా గులాబీ టెస్టు విషయంలో వెనుకంజ వేస్తున్న భారత జట్టును..  బోర్డు కొత్త బాస్‌గా వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఒప్పించేశాడు. గతంలో ఏం జరిగిందో, ఇప్పటిదాకా భారత్‌ ఈ తరహా మ్యాచ్‌లు ఎందుకు ఆడలేదో నిజంగా నాకు తెలీదు. అలాగే అడిలైడ్‌లో కూడా ఎందుకు అంగీకరించలేదో నాకైతే అవగాహన లేదు. కోహ్లితో గంట పాటు సమావేశమయ్యా.

తొలి ప్రశ్నగా డే అండ్‌ నైట్‌ గురించే అడిగాను. కేవలం మూడు సెకన్లలోనే సమాధానమిస్తూ ముందుకెళదాం అన్నాడు. ఎందుకంటే ఖాళీ స్టాండ్స్‌ మధ్య టెస్టులు ఆడిస్తే లాభం లేదనే విషయాన్ని అతడు కూడా గ్రహించాడు. ఇప్పుడు ప్రజలు ఆఫీస్‌లు వదిలి మ్యాచ్‌లకు వచ్చే పరిస్థితి లేదు’ అని గంగూలీ తెలిపాడు. ఈనెల 22 నుంచి ఈడెన్‌లో రెండో టెస్టును ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించనున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top