మిక్స్‌డ్‌ టీ20లో కోహ్లి! | Kohli, Mithali and Harmanpreet Bat for Mixed Gender T20 | Sakshi
Sakshi News home page

మిక్స్‌డ్‌ టీ20లో కోహ్లి!

Apr 4 2019 5:25 PM | Updated on Apr 4 2019 5:25 PM

Kohli, Mithali and Harmanpreet Bat for Mixed Gender T20 - Sakshi

బెంగళూరు: క్రికెట్‌లో మిక్స్‌డ్‌ ఈవెంట్‌కు రంగం సిద్ధమవుతోంది. దీన్ని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించడానికి ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాయల్‌ చాలెంజర్స్‌ యాజమాన్యం(ఆర్సీబీ) కసరత్తులు చేస్తోంది. ఇప్పటివరకూ బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ క్రీడల్లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఉన్న సంగతి అందరకి తెలిసిందే. ఇప్పుడు క్రికెట్‌లో  ‘మిక్స్‌డ్‌’ ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆడ, మగ ఇద్దరూ సమానమే అనే సందేశాన్ని ప్రపంచానికి చాటడమే ఈ మ్యాచ్‌ ఉద్దేశం.

పురుష, మహిళా క్రికెటర్లను కలగలిపిన జట్లతో టీ-20 ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ నిర్వహించేందుకు ఆర్సీబీ సన్నాహాలు చేస్తోంది. వరల్డ్‌కప్‌ తర్వాత ఈ మ్యాచ్‌ నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకోసం విరాట్‌ కోహ్లీ, భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, టీ20 సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, బ్యాట్స్‌వుమన్‌ వేదా కృష్ణమూర్తి పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement