టి20 కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో రాహుల్‌ | KL Rahul In Second Place For T20 Career Best Rank | Sakshi
Sakshi News home page

టి20 కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో రాహుల్‌

Feb 4 2020 1:52 AM | Updated on Feb 4 2020 1:52 AM

KL Rahul In Second Place For T20 Career Best Rank - Sakshi

దుబాయ్‌: న్యూజిలాండ్‌తో ముగిసిన టి20 సిరీస్‌ను 5–0తో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయడంలో ముఖ్య పాత్ర పోషించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచిన భారత బ్యాట్స్‌మన్‌ లోకేశ్‌ రాహుల్‌ టి20 ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టి20 బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో అతను నాలుగు స్థానాలు పురోగతి సాధించాడు. దీంతో 823 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను సాధించాడు.

భారత సారథి విరాట్‌ కోహ్లి తొమ్మిది, రోహిత్‌ శర్మ పదో స్థానాల్లో ఉన్నారు. ఇదే సిరీస్‌లో రాణించిన శ్రేయస్‌ అయ్యర్‌ 55వ, మనీశ్‌ పాండే 58వ స్థానాల్లో నిలిచారు. ఈ విభాగంలో పాకిస్తాన్‌ టి20 సారథి బాబర్‌ ఆజమ్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలర్ల విభాగంలో జస్‌ప్రీత్‌ బుమ్రా 11వ, చహల్‌ 30వ, శార్దుల్‌ ఠాకూర్‌ 57వ, నవదీప్‌ సైనీ 71వ, రవీంద్ర జడేజా 76వ స్థానాల్లో నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement