వైరల్‌: రాహుల్‌ సెలబ్రేషన్‌.. ధోని రియాక్షన్‌

KL Rahul Celebrates His Ton And Dhoni Reaction Is Viral - Sakshi

మాంచెస్టర్‌ : ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలింగ్‌లో కుల్దీప్‌ చెలరేగగా.. బ్యాటింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ విజృంభించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనింగ్‌లో సీనియర్‌ క్రికెటర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలతో పోటీపడుతున్న రాహుల్‌ ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌ వచ్చాడు.

ధావన్‌ వికెట్‌ అనంతరం క్రీజులో వచ్చిన రాహుల్‌ వచ్చిరావడంతోనే ఇంగ్లీష్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్‌ అనంతరం మరింత రెచ్చిపోయాడు. 18 ఓవర్లోనే శతకం పూర్తి చేసి భారత్‌కు విజయాన్నందించాడు. ఇక సెంచరీ అనంతరం రాహుల్‌ సంతోషంతో మైదానంలో సెలబ్రేషన్స్‌ చేసుకోగా.. డ్రెస్సింగ్‌ రూంలోని ఆటగాళ్లంతా నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ తరుణంలో ధోని ఓ ప్రత్యేకమైన లుక్కిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇక కెప్టెన్‌ కోహ్లి సైతం ‘అరే ఏం ఆట బాస్‌’ అని కేఎల్‌ రాహుల్‌ను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top