ఖవాజా, బర్న్స్ శతకాల మోత | Sakshi
Sakshi News home page

ఖవాజా, బర్న్స్ శతకాల మోత

Published Sun, Dec 27 2015 1:20 AM

ఖవాజా, బర్న్స్ శతకాల మోత

తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 345/3
విండీస్‌తో రెండో టెస్టు
మెల్‌బోర్న్:
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజా (227 బంతుల్లో 144; 6 ఫోర్లు; 1 సిక్స్), ఓపెనర్ జో బర్న్స్ (230 బంతుల్లో 128; 16 ఫోర్లు; 1 సిక్స్) శతకాలు సాధించడంతో తొలి రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ 90 ఓవర్లలో మూడు వికెట్లకు 345 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్ (49 బంతుల్లో 32 బ్యాటింగ్; 3 ఫోర్లు), వోజెస్ (24 బంతుల్లో 10 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నారు. 154 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న ఖవాజాకు కెరీర్‌లో ఇది మూడో సెంచరీ. అయితే ఇవన్నీ గత నాలుగు ఇన్నింగ్స్‌లలోనే రావడం విశేషం. మరోవైపు గత 16 ఏళ్లలో బాక్సింగ్ డే టెస్టుకు మెల్‌బోర్న్ మైదానంలో అత్యల్ప(53,389) సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు.
 

Advertisement
Advertisement