స్వదేశానికి విలియమ్సన్‌

Kane Williamson flies back home under unfortunate circumstances - Sakshi

చెన్నై: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ స్వదేశానికి బయల్దేరాడు. విలియమ్సన్‌ బామ్మ కన‍్నుమూయడంతో అతని ఉన్నపళంగా న్యూజిలాండ్‌కు పయనమయ్యాడు. దాంతో ఈ రోజు చెన్నై వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు విలియమ్సన్‌ దూరం కానున్నాడు. అయితే, ఏప్రిల్ 27న రాజస్తాన్‌ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు విలియమ్సన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ విలియమ్సన్‌ అంచనాల మేర ఆడలేదు.

 ప్రస్తుతం జట్టు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో రాణిస్తుండటంతో విలియమ్సన్‌ వైఫల్యం జట్టుపై ప్రభావం చూపించలేదు. కానీ, బెయిర్‌స్టో, డేవిడ్‌ వార్నర్‌లు టోర్నీ మొత్తం జట్టుతో ఉండే అవకాశం లేదు. దీంతో జట్టు బ్యాటింగ్‌ బాధ్యతలు విలియమ్సన్‌ భూజాల మీద వేసుకోవాల్సి ఉంటుంది. గత సీజన్‌లో 735 పరుగులు చేసిన కేన్‌ ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top