అశ్విన్‌.. ఇదేనా నీ క్రికెట్‌ గేమ్‌? | Jos Buttler reveals Mankad peace talks with Ravi Ashwin | Sakshi
Sakshi News home page

అశ్విన్‌.. ఇదేనా నీ క్రికెట్‌ గేమ్‌?

Apr 10 2019 5:10 PM | Updated on Apr 10 2019 5:10 PM

Jos Buttler reveals Mankad peace talks with Ravi Ashwin - Sakshi

జైపూర్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ను కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ చేయడం తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.ఈ అంశంపై మాజీ ఆటగాళ్లతో సహా నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేశారు. మన్కడింగ్‌ విధానం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని కొందరు పేర్కొనగా క్రికెట్‌ లా మేకర్‌ మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) దాన్ని కొట్టిపారేసింది. ఈ విధానం ఆటలో భాగమేనని స్పష్టంచేసింది. దీంతో ఈ విషయం సద్దుమణిగింది. కాగా ఈ వివాదంపై బట్లర్‌ పెదవి విప్పాడు బట్లర్‌. ఆ మ్యాచ్‌ అనంతరం తాను అశ్విన్‌ దగ్గరకు వెళ్లి.. ‘నువ్వు ఇలాంటి క్రికెటే ఆడాలనుకుంటున్నావా.. ఇదేనా నీ క్రికెట్‌ గేమ్‌’ అని సూటిగా ప్రశ్నించానని బట్లర్‌ మంగళవారం మీడియాతో చెప్పాడు.

అశ్విన్‌ కావాలనే బౌలింగ్‌ చేస్తున్నట్లు నటించి తాను క్రీజు వదిలాక బంతిని బెయిల్స్‌కు తాకించి తన వికెట్ తీశాడని అన్నాడు. అది అసలు ఔట్‌గా ప్రకటించకూడదు. కానీ జరిగిపోయింది అని బట్లర్‌ మీడియాకు వివరించాడు. మరొకవైపపు రాబోవు వన్డే వరల్డ్‌కప్‌ గురించి మాట్లాడుతూ ప్రపంచకప్‌ అనేది ఓపెన్‌ రేస్‌ అని.. ఈసారి ఇంగ్లండ్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందన్నాడు. అలాగే భారత్‌, ఆసీస్‌ జట్లు కూడా పోటీలో ఉన్నాయని తెలిపాడు.
(ఇక్కడ చదవండి: ఏ అశ్విన్‌.. నేను క్రీజులోనే ఉన్నా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement