ఏ అశ్విన్‌.. నేను క్రీజులోనే ఉన్నా!

David Warner Counters Ravichandran Ashwin Mankad Threat In Unique Style - Sakshi

మన్కడింగ్‌ ముప్పుకు కౌంటరిచ్చిన డేవిడ్‌ వార్నర్‌

మొహాలి : ఐపీఎల్‌-12లో కింగ్స్‌పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చేసిన మన్కడింగ్‌ ఔట్‌ అత్యంత వివాదస్పద ఘటనగా మిగిలిపోయంది. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అశ్విన్‌ ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ను ఈ తరహాలో ఔట్‌ చేసి తీవ్ర విమర్శలపాలయ్యాడు. ఇది జరిగి చాలా రోజులు అవుతున్నా.. ఈ మన్కడింగ్‌ వివాదం మాత్రం అశ్విన్‌ను ఇప్పట్లో వదిలేలా లేదు. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ డెవిడ్‌ వార్నర్‌.. మన్కడింగ్‌ వివాదాన్ని గుర్తు చేసేలా అశ్విన్‌ను టీజ్‌ చేశాడు.

అయితే అది ఉద్దేశపూర్వకంగా చేశాడా? లేక అశ్విన్‌ మన్కడింగ్‌కు బలికాకుండా జాగ్రత్త వ్యవహరించాడా? అనేది వార్నర్‌కే తెలియాలి. కానీ తాను వ్యవహరించిన తీరుపై కామెంటేటర్స్‌ మాత్రం కామెడీ చేశారు. ‘ఏ అశ్విన్‌ నేను క్రీజులోనే ఉన్నా’ అని డేవిడ్‌ వార్నర్‌ చూపిస్తున్నాడని సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఫోటో క్లిప్‌ కూడా మనకు అలానే అనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో వార్నర్‌ (62 బంతుల్లో 70 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ రాణించినప్పటికి హైదరాబాద్‌ 6 వికెట్లతో పరాజయం పాలైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top