
జో రూట్
వరుసగా రెండు పరాజయాలతో డీలా పడ్డ జట్టు ఆటగాళ్లను ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ అప్రమత్తం చేశాడు..
బర్మింగ్‌హామ్ : వరుసగా రెండు పరాజయాలతో డీలా పడ్డ జట్టు ఆటగాళ్లను ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ అప్రమత్తం చేశాడు. సెమీస్ చేరాలంటే ఆదివారం భారత్‌తో, జూలై 3న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లు నెగ్గాల్సి ఉన్న నేపథ్యంలో ఎడ్జ్‌బాస్టన్ వాతావరణాన్ని తట్టుకుంటూ ప్రశాంతంగా ఉండాలని సూచించాడు. తమకు ఇప్పటికీ సెమీస్ చేరగల సత్తా ఉందని, దానిని సాధిస్తే ఎలా చేరారన్నదానిని ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్యానించాడు. రాబోయే మ్యాచ్‌లను క్వార్టర్ ఫైనల్స్‌గా పరిగణిస్తామని అతడు పేర్కొన్నాడు. ఇలాంటి కఠిన పరిస్థితి ఎప్పుడూ ఉంటుందని, కాకపోతే తమకు అనుకున్నదాని కంటే ముందుగానే వచ్చిందని రూట్ అభిప్రాయపడ్డాడు.