కివీస్కు మరో ఎదురుదెబ్బ | Jimmy Neesham Ruled Out of New Zealand's Opening Test Against India | Sakshi
Sakshi News home page

కివీస్కు మరో ఎదురుదెబ్బ

Sep 20 2016 11:53 AM | Updated on Sep 4 2017 2:16 PM

కివీస్కు మరో ఎదురుదెబ్బ

కివీస్కు మరో ఎదురుదెబ్బ

ప్పటికే భారత్ తో టెస్టు సిరీస్కు టిమ్ సౌతీ దూరం కావడంతో సతమవుతున్న న్యూజిలాండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది.

కాన్పూర్:ఇప్పటికే భారత్ తో టెస్టు సిరీస్కు టిమ్ సౌతీ దూరం కావడంతో సతమవుతున్న న్యూజిలాండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆల్ రౌండర్ జిమ్మీ నీషామ్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు. ట్రైనింగ్ సెషన్లో నీషామ్ పక్కటెముకలు పట్టేయడంతో గురువారం కాన్పూర్ లో ఆరంభమయ్యే మొదటి టెస్టు నుంచి విశ్రాంతినిస్తున్నట్లు న్యూజిలాండ్ కోచ్ హెస్సెన్ వెల్లడించాడు.

'గత కొన్ని రోజుల నుంచి నీషామ్ సౌకర్యవంతంగా లేడు. అతను పక్కటెముల గాయంతో సతమవుతున్నాడు. ఇది దీర్ఘకాలిక గాయం కాదు. అయినప్పటికీ తొలి టెస్టుకు అతన్ని తుది జట్టులో తీసుకోవడం లేదు. అతని స్థానంలో మరో ఆటగాడ్ని ఇంకా ఎంపిక చేయలేదు'అని హెస్సెన్ పేర్కొన్నాడు. అంతకుముందు న్యూజిలాండ్ ప్రధాన పేసర్ సౌతీ గాయం కారణంగా టెస్టు సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. ప్రాక్టీస్ సెషన్లో సౌతీ ఎడమ కాలికి గాయం కావడంతో అతను టెస్టు సిరీస్ నుంచి అర్థాంతరంగా వైదొలగాల్సి వచ్చింది.

 

Advertisement
 
Advertisement
Advertisement