
దంబుల్లా: సఫారీ బౌలింగ్ దెబ్బకు శ్రీలంక తోకముడిచింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన దక్షిణాఫ్రికా ఐదు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. పేసర్ రబడ (4/41), స్పిన్నర్ షమ్సీ (4/33) చెలరేగడంతో ఆదివారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలిచింది.
తొలుత శ్రీలంక 34.3 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. కుశాల్ పెరీరా (72 బంతుల్లో 81; 11 ఫోర్లు, 1 సిక్స్), తిసారా పెరీరా (30 బంతుల్లో 49; 8 ఫోర్లు) రాణించారు. తర్వాత దక్షిణాఫ్రికా 31 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసి గెలిచింది. డుమిని (53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డికాక్ (47), డు ప్లెసిస్ (47) నిలకడగా ఆడి జట్టును గెలిపించారు.