
క్యాప్ అందజేస్తున్నధోని
డబ్లిన్ : ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20తో భారత యువ పేస్ బౌలర్ సిద్దార్థ్ కౌల్ అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. మ్యాచ్‌కు ముందు సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కౌల్‌కు క్యాప్ అందజేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఐర్లాండ్ మరోసారి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో సైతం ఛేజింగ్‌కు మొగ్గు చూపి చతికిలపడ్డ విషయం తెలిసిందే. అయితే ఐర్లాండ్ ఫీల్డింగ్ తీసుకోవడంతో మరోసారి భారత బ్యాట్స్‌మన్ తొలి మ్యాచ్‌లాగా చెలరేగే అవకాశం ఉండటం అభిమానులకు సానుకూలంశం. ఇక అంతా అనుకున్నట్లు ఈ మ్యాచ్‌కు భారత జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పసికూనతో తొలి మ్యాచ్ అనంతరం భారీ మార్పులు చేసి అందరికి అవకాశం ఇస్తామన్న కెప్టెన్ కోహ్లి అన్నట్లుగా మాట నిలబెట్టుకున్నాడు. ఏకంగా నలుగురికి అవకాశం కల్పించాడు. దీంతో శిఖర్ ధావన్, ఎంఎస్ ధోని, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలు ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. వారి స్థానాల్లో కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, ఉమేశ్ యాదవ్, సిద్దార్థ్ కౌల్‌కు చోటు దక్కింది. ఇక ఐర్లాండ్ జట్టు ఒక మార్పు చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లోనైనా గట్టి పోటీనివ్వాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది.
తుది జట్లు
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, మనీష్ పాండే, హార్ధిక్ పాండ్యా, ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, సిద్దార్థ్ కౌల్
ఐర్లాండ్ : పాల్‌స్టిర్లింగ్, విలియమ్ పోర్టర్‌ఫీల్డ్, జేమ్స్ షెనాన్, యాండీ, సిమీసింగ్, గారీ విల్సన్ (కెప్టెన్), కెవిన్, స్టువర్ట్ థాంప్సన్, జియార్జ్ డక్‌రెల్, బోయిద్ రాన్‌కిన్, పీటర్‌చేస్