నేటి నుంచి ఇరానీ కప్ | irani cup starts from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇరానీ కప్

Mar 17 2015 1:30 AM | Updated on Sep 2 2017 10:56 PM

భారత దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక పోరు ఇరానీ కప్‌కు రంగం సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం నుంచి జరిగే ఈ ఐదు రోజుల....

కర్ణాటకతో రెస్టాఫ్ ఇండియా పోరు
బెంగళూరు: భారత దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక పోరు ఇరానీ కప్‌కు రంగం సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం నుంచి జరిగే ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో రంజీ చాంపియన్ కర్ణాటకతో రెస్టాఫ్ ఇండియా తలపడుతుంది. వినయ్ సారథ్యంలో కర్ణాటక ఈ సీజన్ రంజీల్లో అద్భుతంగా ఆడింది. రాబిన్ ఉతప్ప, మనీష్ పాండే, మిథున్‌లతో ఈ జట్టు పటిష్టంగా ఉంది. అయితే ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఇక మనోజ్ తివారీ సారథ్యంలో బరిలోకి దిగుతున్న రెస్ట్ జట్టులో ఉన్ముక్త్ చంద్, ప్రజ్ఞాన్ ఓజా, బాబా అపరాజిత్, కేదార్ జాదవ్ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement