ఐపీఎల్‌ నిరవధిక వాయిదా!  | IPL Postponed Indefinitely Due To Coronavirus | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ నిరవధిక వాయిదా! 

Apr 12 2020 4:19 AM | Updated on Apr 12 2020 7:54 AM

IPL Postponed Indefinitely Due To Coronavirus - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్న మెంట్‌ నిరవధికంగా వాయిదా పడటం ఖాయమైంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించకపోయినా... శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈనెలాఖరువరకు లాక్‌డౌన్‌ పొడిగింపునకు మొగ్గు చూపడంతో ఐపీఎల్‌ టోర్నీ జరిగే పరిస్థితి కనిపించడంలేదు. ‘పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. ఫలితంగా ప్రస్తుతానికైతే ఐపీఎల్‌ జరిగే పరిస్థితి లేదు. దాంతో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేయక తప్పదు. కానీ ఈ ఏడాది టోర్నీని రద్దు చేసే ఆలోచన లేదు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement