ఐపీఎల్‌లో మే 1న పుణేలో జరగాల్సిన మ్యాచ్‌ను అక్కడే నిర్వహించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ముంబై: ఐపీఎల్‌లో మే 1న పుణేలో జరగాల్సిన మ్యాచ్‌ను అక్కడే నిర్వహించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్‌లన్నీ తరలించాలని గతంలో కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
అయితే ఏప్రిల్ 29న పుణేలో ధోనిసేన మ్యాచ్ ఆడి, తిరిగి మే 1న వేరే వేదికకు వెళ్లి ఆడటం కష్టమని, కాబట్టి ఈ ఒక్క మ్యాచ్‌నూ అనుమతించాలని బీసీసీఐ హైకోర్టును కోరింది.