బెంగళూరు నుంచికూడా తరలించండి! | ipl 9 matches to move to tha Bangalore | Sakshi
Sakshi News home page

బెంగళూరు నుంచికూడా తరలించండి!

Apr 12 2016 12:39 AM | Updated on Oct 30 2018 5:50 PM

ఐపీఎల్ తొమ్మిదో సీజన్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే మహారాష్ట్రలో జరిగే మ్యాచ్‌లపై సందిగ్ధత కొనసాగుతుండగా...

సాక్షి, బెంగళూరు: ఐపీఎల్ తొమ్మిదో సీజన్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే మహారాష్ట్రలో జరిగే మ్యాచ్‌లపై సందిగ్ధత కొనసాగుతుండగా... తాజాగా బెంగళూరు నుంచి కూడా ఐపీఎల్‌ను తరలించాలని కోరుతూ కర్నాటక హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది. రాష్ట్రంలో తీవ్ర నీటి కరవు ఉందని, ఇలాంటి స్థితిలో ఐపీఎల్ కోసమంటూ ఎక్కువ నీటితో స్టేడియంలోని పిచ్‌లను తడపడం సరికాదని పిటిషన్‌దారుడు శ్రీనివాస్‌శర్మ న్యాయస్థానానికి తెలిపారు.

అంతేకాకుండాఆ నీటిని జలమండలి అక్రమంగా సరఫరా చేస్తోందని గుర్తుచేశారు. నేడు (మంగళవారం) సన్‌రైజర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్ ఆడనుండగా ఈ పిల్ కూడా విచారణకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement