ఐపీఎల్-7: ముంబై లక్ష్యం 157 | IPL-7: punjab sets 157 runs target for Mumbai | Sakshi
Sakshi News home page

ఐపీఎల్-7: ముంబై లక్ష్యం 157

May 21 2014 9:35 PM | Updated on Sep 2 2017 7:39 AM

ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా కింగ్స్ లెవెన్ పంజాబ్ 157 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్కు నిర్దేశించింది.

చండీగఢ్: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా కింగ్స్ లెవెన్ పంజాబ్ 157 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్కు నిర్దేశించింది. బుధవారం జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 156 పరుగులు చేసింది.

ఓపెనర్లు సెహ్వాగ్ 17, మనన్ వోహ్రా 36 పరుగులు చేశారు. కాగా సూపర్ ఫామ్లో ఉన్న మ్యాక్స్ వెల్ రెండే పరుగులకు వెనుదిరిగాడు. షాన్ మార్ష్ (30), జార్జి బెయిలీ (39) రాణించారు. ముంబై బౌలర్లు శ్రేయస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా  రెండేసి వికెట్లు తీశారు.  


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement