హైదరాబాద్లో చెలరేగిన సన్రైజర్స్ | ipl-7: Hyderabad sets 206 runs target for Punjab | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో చెలరేగిన సన్రైజర్స్

May 14 2014 5:49 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 206 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ లెవెన్ పంజాబ్కు నిర్దేశించింది.

ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 206 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ లెవెన్ పంజాబ్కు నిర్దేశించింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై హైదరాబాద్ బ్యాట్స్మెన్ చెలరేగిపోయారు. ఓపెనర్లు శిఖర్ ధవన్ (45), అరోన్ ఫించ్ (20) 65 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించారు. అనంతరం నమన్ ఓజా (36 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఓజాకు డేవిడ్ వార్నర్ (23 బంతుల్లో 44) జతకలవడంతో హైదరాబాద్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. స్కోరు 200 దాటింది. పంజాబ్ బౌలర్ రుషి ధావన్ రెండు వికెట్లు తీశాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement