ఐపీఎల్-7: పంజాబ్ లక్ష్యం 165 | IPL-7: Delhi sets 165 runs target for Punjab | Sakshi
Sakshi News home page

ఐపీఎల్-7: పంజాబ్ లక్ష్యం 165

May 19 2014 9:40 PM | Updated on Sep 2 2017 7:34 AM

ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా సోమవారం ఇక్కడ జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 165 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ లెవెన్ పంజాబ్కు నిర్దేశించింది.

ఢిల్లీ: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా సోమవారం ఇక్కడ జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 165 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ లెవెన్ పంజాబ్కు నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి 164 పరుగులు సాధించింది. ఓపెనర్ మురళీ విజయ్ 5 పరుగులకే వెనుదిరిగినా మరో ఓపెనర్ కెవిన్ పీటర్సన్ (49) రాణించాడు. దినేష్ కార్తీక్ (69) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు డుమినీ 17 పరుగులు చేశాడు. కాగా ఆ తర్వాత పంజాబ్ బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీసి ఢిల్లీ జోరుకు బ్రేక్ వేశారు. పంజాబ్ బౌలర్లు సందీప్ శర్మ, హెండ్రిక్స్ మూడేసి వికెట్లు తీశారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement