ఐపీఎల్‌ షెడ్యూల్‌ విడుదల..!

IPL 2019 schedule announced for first 2 weeks - Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2019 సీజన్‌కు సంబంధించి తొలి రెండు వారాల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ మేరకు 17 మ్యాచ్‌లకు షెడ్యూల్‌ మాత్రమే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) తాజాగా వెల్లడించింది. వచ్చే నెల 23వ తేదీ నుంచి ఆరంభమయ్యే ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ సింగ్స్‌ తలపడనుంది. 

త్వరలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో తొలి రెండు వారాల ఐపీఎల్‌ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్‌ ఖరారైన తర్వాత మిగతా మ్యాచ్‌లకు షెడ్యూల్‌ను విడుదల చేయనున‍్నారు. పోలింగ్ తేదీల ఆధారంగా స్థానిక అధికారులతో చర్చించిన తర్వాత పూర్తిస్థాయి ఐపీఎల్‌ షెడ్యూల్‌ వెలువడనుంది.

తొలి రెండు వారాల ఐపీఎల్‌ షెడ్యూల్‌..

1. మార్చి 23- చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(చెన్నై)

2. మార్చి 24- కోల్‌కతా నైట్‌రైడర్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(కోల్‌కతా)

3. మార్చి 24-ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ కేపిటల్స్‌(ముంబై)

4. మార్చి 25- రాజస్తాన్‌ రాయల్స్‌-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌(జైపూర్‌)

5. మార్చి 26- ఢిల్లీ కేపిటల్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌(ఢిల్లీ)

6. మార్చి 27-కోల్‌కతా నైట్‌రైడర్స్‌- కింగ్స్‌ పంజాబ్‌(కోల్‌కతా)

7. మార్చి 28-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-ముంబై ఇండియన్స్‌(బెంగళూరు)

8. మార్చి 29-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రాజస్తాన్‌ రాయల్స్‌(హైదరాబాద్‌)

9. మార్చి 30- కింగ్స్‌ పంజాబ్‌-ముంబై ఇండియన్స్‌(మొహాలీ)

10. మార్చి 30- ఢిల్లీ కేపిటల్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌(ఢిల్లీ)

11. మార్చి 31- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(హైదరాబాద్‌)

12. మార్చి 31-చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాజస్తాన్‌ రాయల్స్‌(చెన్నై)

13. ఏప్రిల్‌ 1- కింగ్స్‌ పంజాబ్‌-ఢిల్లీ కేపిటల్స్‌(మొహాలీ)

14. ఏప్రిల్‌ 2- రాజస్తాన్‌ రాయల్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(జైపూర్‌)

15. ఏప్రిల్‌ 3-ముంబై ఇండియన్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌(ముంబై)

16. ఏప్రిల్‌ 4- ఢిల్లీ కేపిటల్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఢిల్లీ)

17. ఏప్రిల్‌ 5- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-కోల్‌కతా నైట్‌రైడర్స్‌(బెంగళూరు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top