భారత్‌కు రెండో గెలుపు | India's Second win | Sakshi
Sakshi News home page

భారత్‌కు రెండో గెలుపు

Jul 21 2015 12:07 AM | Updated on Sep 3 2017 5:51 AM

వోల్వో అంతర్జాతీయ అండర్-21 హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది...

బ్రెడా (నెదర్లాండ్స్): వోల్వో అంతర్జాతీయ అం డర్-21 హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 3-0 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట ఆరో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి భారత్ ఖాతా తెరిచాడు. 29వ నిమిషంలో సిమ్రన్‌జీత్ సింగ్ ఫీల్డ్ గోల్‌తో భారత ఆధిక్యం 2-0కు చేరుకుంది. 41వ నిమిషంలో లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ లక్ష్యానికి చేర్చాడు. మంగళవారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్‌లో బెల్జియంతో భారత్ తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement