డివిలియర్స్‌పై భగ్గుమంటున్న భారతీయులు

Indians Trolled AB de Villiers For Posting Indian National Flag - Sakshi

న్యూఢిల్లీ : విధ్వంసక క్రికెటర్‌, ‘మిస్టర్‌ 360’ ఏబీ డివిలియర్స్‌పై భారత అభిమానులు భగ్గుమంటున్నారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ చేసిన ఓ సోషల్‌ మీడియా పోస్టింగే అందుకు కారణం. దక్షిణాఫ్రికాలో తయారయ్యే ద ఫస్ట్‌ ఎలెవన్‌ అనే వైన్‌ బ్రాండ్‌ ఉత్పత్పులు భారత్‌ మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ క్రమంలో డివిలియర్స్‌ ‘మా దేశ వైన్‌ ఇ‍ప్పుడు భారత్‌లో దొరుకుతోంది. చాలా ఎగ్జైట్‌ అవుతున్నాను. ఓ బాటిల్‌ పట్టుకుంటే మీరు ఏం ఆలోచిస్తారంటూ’ ట్వీట్‌ చేశాడు.

అదే ఉత్సాహంలో ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అదే సమాచారాన్ని రాసుకొచ్చిన డివిలియర్స్‌.. భారత జాతీయ పతాకం ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశాడు. న్యూఢిల్లీలో ఆల్కహాల్‌ బ్రాండ్‌ లాంచ్‌ అయిందంటూ త్రివర్ణ పతాకాన్ని అప్‌లోడ్‌ చేయడమేంటని ఏబీని ప్రశ్నిస్తున్నారు. భారతీయులను అవమానించడంతో పాటు.. క్రికెట్‌ను పక్కనపెట్టి ఆల్కహాల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా చాలా గొప్ప పనులు చేస్తున్నావంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. భారతీయులం నిన్ను ఎంతగానో అభిమానిస్తే.. నువ్వు మాత్రం నీ నీచబుద్ధిని ప్రదర్శించావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఐపీఎల్‌-11 సీజన్‌ అనంతరం క్రికెట్‌ అన్ని ఫార్మాట్లకు డివిలియర్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top