భారత రెజ్లర్లకు మూడు పతకాలు | Indian wrestlers won three medals | Sakshi
Sakshi News home page

భారత రెజ్లర్లకు మూడు పతకాలు

Feb 2 2014 1:24 AM | Updated on Sep 2 2017 3:15 AM

భారత రెజ్లర్లకు మూడు పతకాలు

భారత రెజ్లర్లకు మూడు పతకాలు

కొత్త ఏడాదిలో పోటీపడిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనే భారత రెజ్లర్లు సత్తా చాటుకున్నారు.

న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో పోటీపడిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనే భారత రెజ్లర్లు సత్తా చాటుకున్నారు. అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో జరిగిన డేవ్ షుల్జ్ స్మారక టోర్నమెంట్‌లో భారత రెజ్లర్లు మూడు పతకాలు సాధించారు. ఇందులో ఒక్కో స్వర్ణ, రజత, కాంస్య పతకాలున్నాయి.
 
  పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో ప్రవీణ్ రాణా (74 కేజీలు) స్వర్ణం సాధించగా... అమిత్ కుమార్ (61 కేజీలు) రజతం... సందీప్ తోమర్ (57 కేజీలు) కాంస్యం నెగ్గారు. ఫైనల్లో ప్రవీణ్ రాణా 5-0తో డాన్ వాలిమోంట్ (అమెరికా)పై నెగ్గగా... అమిత్ 0-11తో బొగోమొయెవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. కాంస్య పతక బౌట్‌లో సందీప్ తోమర్ 10-0తో స్టీవ్ మిచ్ (అమెరికా)పై గెలుపొందాడు. 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో బజరంగ్ (భారత్) 1-11తో  నొవాచ్కోవ్ (బల్గేరియా) చేతిలో ఓడిపోయాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement