శ్రీలంక విజయలక్ష్యం 260 | indian womens set target of 260 against srilanka | Sakshi
Sakshi News home page

శ్రీలంక విజయలక్ష్యం 260

Feb 7 2017 2:23 PM | Updated on Nov 9 2018 6:43 PM

మహిళల వన్డే ప్రపంచకప్ అర్హత పోటీల్లో భాగంగా శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్లో భారత్ జట్టు 260 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్ అర్హత పోటీల్లో భాగంగా శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్లో భారత్ జట్టు 260 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళలు ఆదిలో ఓపెనర్ మిశ్రామ్(6) వికెట్ను కోల్పోయినప్పటికీ, మరో ఓపెనర్ దీప్తి శర్మ(54) రాణించడంతో తేరుకుంది.

 

అనంతరం దేవికా వైద్య(89), మిథాలీ రాజ్(70నాటౌట్)లు హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ జోడి రెండో వికెట్ కు 123 పరుగుల జోడించి భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.



 

Advertisement
 
Advertisement
Advertisement