ఫైనల్లో భారత్‌ 

 Indian team reached the final of the international hockey tournament - Sakshi

తౌరంగ (న్యూజిలాండ్‌): నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరింది. ఆతిథ్య న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో 3–1తో భారత్‌ జయభేరి మోగించింది. ఆరంభం నుంచి దూకుడుకు తోడు అద్భుతమైన డిఫెన్స్‌తో చెలరేగిన మన ఆటగాళ్లు... ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్‌ ప్రారంభమైన రెండో నిమిషంలోనే భారత్‌ తొలి గోల్‌ నమోదు చేయడంతో ప్రత్యర్థి జట్టు వెనుకబడిపోయింది.

ఆ తర్వాత కూడా దాడులు కొనసాగించిన భారత్‌ చివరకు 3–1తో గెలుపొందింది. భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (2వ ని.లో), దిల్‌ప్రీత్‌ సింగ్‌ (12వ ని.లో), మన్‌దీప్‌ సింగ్‌ (47వ ని.లో) తలో గోల్‌ చేశారు. ఆదివారం జరిగే తుది పోరులో మన జట్టు బెల్జియంతో తలపడనుంది. లీగ్‌ దశలో భారత్‌ బెల్జియం చేతిలో 0–2తో ఓటమి పాలైన విషయం తెలిసిందే.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top