పాక్‌పై భారత్‌ ఘనవిజయం | India Won By 8 Wickets Over Pakistan In Asia Cup | Sakshi
Sakshi News home page

పాక్‌పై భారత్‌ ఘనవిజయం

Sep 19 2018 11:35 PM | Updated on Sep 19 2018 11:51 PM

India Won By 8 Wickets Over Pakistan In Asia Cup - Sakshi

భువనేశ్వర్‌ కుమార్‌

దుబాయ్‌: ఆసియాకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ ఘనవిజయం సాధించింది. పాక్‌ విసిరిన స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ 43.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్‌ అయింది. పాక్‌ బ్యాట్స్‌మన్లలో బాబర్‌ ఆజమ్‌ 47(62 బంతులు), షోయబ్‌ మాలిక్‌43(67 బంతులు)లు రాణించారు. కేదార్‌ జాదవ్‌, భువనేశ్వర్‌లు చెరో మూడు వికెట్లు, బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఎలాంటి తడబాటుకు గురికాకుండా టార్గెట్‌ను 29 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. రోహిత్‌ శర్మ52(39 బంతులు), ధావన్‌46(54 బంతులు), రాయుడు31 నాటౌట్‌(46 బంతులు), కార్తీక్‌31 నాటౌట్‌(37 బంతులు) రాణించారు.

Advertisement
 
Advertisement
Advertisement