ఆస్ట్రేలియాలో భారత్ కు గడ్డుకాలమే: మెక్ గ్రాత్ | India will have a tough time during Australia tour: McGrath | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో భారత్ కు గడ్డుకాలమే: మెక్ గ్రాత్

Aug 18 2014 6:12 PM | Updated on Sep 2 2017 12:04 PM

భారత జట్టుకు ఆస్ట్రేలియా పర్యటన కఠిన పరీక్షేనని ఫాస్ట్ బౌలర్, మాజీ క్రికెటర్ మెక్ గ్రాత్ అన్నారు

న్యూఢిల్లీ: భారత జట్టుకు ఆస్ట్రేలియా పర్యటన కఠిన పరీక్షేనని ఫాస్ట్ బౌలర్, మాజీ క్రికెటర్ మెక్ గ్రాత్ అన్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో దారుణ ఓటమి తర్వాత..ఈ సంవత్సరాంతంలో ఆస్ట్రేలియాలో భారత జట్టు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని మెక్ గ్రాత్ జోస్యం చెప్పారు. క్యాచ్ లు వదిలేయడం ద్వారా భారత్ పై విపరీతమైన ఒత్తిడి పెరిగిందన్నారు. 
 
గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు 0-4 తేడాతో ఓటమి పాలైన సంగతిని ఆయన గుర్తు చేశారు. గత యాషెస్ సిరీస్ లో భారత్ ను ఓడించిన ఇంగ్లాండ్ ను 5-0 తేడాతో ఆస్ట్రేలియా ఓడించిందని మెక్ గ్రాత్ అన్నారు. ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు భారత జట్టు చెమటోడ్చాల్సిందేనని మెక్ గ్రాత్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement