శ్రీలంకలో వన్డే సిరిస్ గెలిచిన యువ భారత్ | India Under-19 won Oneday Series in Srilanka | Sakshi
Sakshi News home page

శ్రీలంకలో వన్డే సిరిస్ గెలిచిన యువ భారత్

Aug 8 2013 5:31 PM | Updated on Nov 9 2018 6:43 PM

శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ అండర్-19 యూత్ జట్టు 2-0తో గెల్చుకుంది.

శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ అండర్-19 యూత్ జట్టు 2-0తో గెల్చుకుంది. గురువారం జరిగిన మూడో వన్డేలో లంకను యువభారత్ 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటయింది. ఎస్ఎన్ ఖాన్ 4 కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టారు.

138 పరుగుల లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  32.5 ఓవర్లలో 141 పరుగులు చేసింది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో 22 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. దీంతో మూడు  తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement