బెంగళూరు టెస్టు; మూడో రోజు ఆట రద్దు | india-south africa test match; day 3 game called off by rain | Sakshi
Sakshi News home page

బెంగళూరు టెస్టు; మూడో రోజు ఆట రద్దు

Nov 16 2015 12:10 PM | Updated on Sep 3 2017 12:34 PM

భారత్- దక్షిణాఫ్రికా రెండో టెస్టును వరుణుడు వెంటాడుతున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ మూడో రోజు సోమవారం ఆట కూడా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది.

బెంగళూరు: భారత్- దక్షిణాఫ్రికా రెండో టెస్టును వరుణుడు వెంటాడుతున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ మూడో రోజు సోమవారం ఆట కూడా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. బెంగళూరులో భారీ వర్షం కురుస్తుండటంతో వేదిక చిన్నస్వామి స్టేడియం చిత్తడిగా మారిపోయింది. దీంతో ఈ రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.


ఆదివారం కూడా వర్షం కురవడంతో రెండో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయిన సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తున్నాయి. మ్యాచ్ తొలి రోజు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 214 పరుగులకు ఆలౌట్ కాగా,  టీమిండియా 80/0 స్కోరు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement