భారత్‌దే హాకీ సిరీస్ | India outplay Spain 4-2 to win 3-match hockey series 2-1 | Sakshi
Sakshi News home page

భారత్‌దే హాకీ సిరీస్

Aug 13 2015 11:44 PM | Updated on Sep 3 2017 7:23 AM

భారత్‌దే హాకీ సిరీస్

భారత్‌దే హాకీ సిరీస్

స్పెయిన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత హాకీ జట్టు 2-1తో గెలుచుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన సర్దార్ సింగ్ సేన వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి సత్తా చాటింది.

 స్పెయిన్‌పై ఆఖరి మ్యాచ్‌లో విజయం
 టెరాసా (స్పెయిన్): స్పెయిన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత హాకీ జట్టు 2-1తో గెలుచుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన సర్దార్ సింగ్ సేన వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి సత్తా చాటింది. గురువారం జరిగిన మూడో మ్యాచ్‌లో భారత జట్టు 4-2తో గెలిచింది. మ్యాచ్ 24వ నిమిషంలో రూపిందర్ పాల్ సింగ్ భారత్‌కు ఆధిక్యం అందించాడు. అయితే తర్వాతి నిమిషంలోనే స్పెయిన్ తరఫున జేవియర్ గోల్ చేశాడు. అనంతరం 45వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ గోల్‌తో జట్టు 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే తేరుకున్న స్పెయిన్ 49వ నిమిషంలో జేవియర్ చేసిన మరో గోల్‌తో స్కోరును సమం చేసుకుంది. అయితే భారత ఫార్వర్డ్ ఆటగాడు రమణ్‌దీప్ సింగ్ 50, 51వ నిమిషాల్లో పటిష్ట స్పానిష్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ మెరుపు వేగంతో రెండు గోల్స్ అందించడంతో జట్టు చక్కటి విజయాన్ని సాధించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement