కుప్పకూలిన టాప్ ఆర్డర్, భారత్ (46/4) | India in deep trouble, England bowler wreck Indian top order | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన టాప్ ఆర్డర్, భారత్ (46/4)

Aug 7 2014 4:40 PM | Updated on Sep 2 2017 11:32 AM

కుప్పకూలిన టాప్ ఆర్డర్,  భారత్ (46/4)

కుప్పకూలిన టాప్ ఆర్డర్, భారత్ (46/4)

పటౌడీ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు నాలుగవ టెస్ట్ లో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది

మాంచెస్టర్: పటౌడీ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు నాలుగవ టెస్ట్ లో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టును బ్రాడ్, అండర్సన్ లు కుప్పకూల్చారు. 
 
భారత జట్టులో మురళీ విజయ్, పూజారా, కోహ్లీలు పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరారు. గంభీర్ 4 పరుగులు చేసి బ్రాడ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం రహానే, కెప్టెన్ ధోని లు క్రీజులో ఉన్నారు. 
 
అండర్సన్, బ్రాడ్ లు చెరో రెండు వికెట్లు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం (5.30 నిమిషాలకు) భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 46 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. నాలుగవ టెస్ట్ మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరుగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement