శాంసన్‌ ఇంకా ఆగాల్సిందే..

IND vs WI 1st T20: Rishabh Pant In Samson Miss Out  - Sakshi

హైదరాబాద్‌: టీ20 ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా వెస్టిండీస్‌తో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌లో తలపడనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానంలో తొలి టీ20కి వేదికైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. గాయం కారణంగా బంగ్లాదేశ్‌ సిరీస్‌కు దూరమైన భువనేశ్వర్‌ కుమార్‌ పునరాగమనం చేశాడు. భువీ రాకతో ఉమేశ్‌ యాదవ్‌ తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఇక టెస్టు ఫార్మట్‌లో అదరగొట్టిన మహ్మద్‌ షమీకి టీ20 తుది జట్టులో చోటు దక్కడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. 

యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ వైపు మరోసారి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మొగ్గుచూపడంతో సంజూ శాంసన్‌ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక శిఖర్‌ ధావన్‌ గాయం కారణంగా దూరం అవడంతో కేఎల్‌ రాహుల్‌ను ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. సారథి విరాట్‌ కోహ్లి రాకతో మనీశ్‌ పాండేకు తుది జట్టులో అవకాశం కోల్పోయాడు. ఇక సారథిగా బాధ్యతలు చేపట్టిన పొలార్డ్‌ తుది జట్టులో తన మార్క్‌ చూపించాడు. రూథర్‌ ఫర్డ్‌, కీమో పాల్‌, నికోలసర్‌ పూరన్‌లను పక్కకు పెట్టాడు. 

తుదిజట్లు:
భారత్‌: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, యజ్వేంద్ర చహల్‌

వెస్టిండీస్‌: పొలార్డ్‌(కెప్టెన్‌), సిమన్స్‌, లూయిస్‌, బ్రాండన్ కింగ్, హెట్‌మైర్,  దినేశ్ రామ్‌దిన్, జాసన్‌ హోల్డర్‌, వాల్ష్‌, షెల్డన్‌ కాట్రెల్‌, విలియమ్స్‌, పియర్

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top