బుమ్రాను అధిగమించిన చహల్‌

IND VS WI 1st T20: Chahal equalled Ashwins Record - Sakshi

హైదరాబాద్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ పొట్టి ఫార్మట్‌లో టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు(52) తీసిన ఆటగాడిగా రవిచంద్రన్‌ అశ్విన్‌ సరసన చేరాడు. విండీస్‌ బ్యాట్స్‌మన్‌ హెట్‌మైర్‌ వికెట్‌ సాధించడంతో ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో జస్ప్రిత్‌ బుమ్రా(51 వికెట్లు) రికార్డును అధిగమించాడు.

ఇక ఇప్పటికే టీమిండియా తరుపున అతి తక్కువ మ్యాచ్‌ల్లో(34) 50 వికెట్లు అందుకున్న ఆటగాడిగా చహల్‌ రికార్డు సాధించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో శ్రీలంక స్పి​న్నర్‌ అజంత మెండీస్‌(26) ఆగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు టీ20ల్లో 32 మంది బౌలర్లు 50కి పైగా వికెట్లు సాధించారు. ఈ జాబితాలో టీమిండియా తరుపున అశ్విన్‌, బుమ్రా, చహల్‌లు ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో హెట్‌మైర్‌తో పాటు పొలార్డ్‌ వికెట్‌కు కూడా చహల్‌ పడగొట్టాడు. 

మహా అద్భుతం..
వెస్టిండీస్‌పై విశ్వరూపం ప్రదర్శించిన టీమిండియా సారథిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. కోహ్లి సుడిగాలి ఇన్నింగ్స్‌తో అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలుండగానే టీమిండియా ఛేదించిందని మాజీ క్రికెటర్లు ప్రశంసించారు. ఇక వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు రిచర్డ్స్‌ ట్విటర్‌ వేదికగా కొనియాడాడు. కోహ్లి ఆట అద్భుతం.. మహా అద్భుతం అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి (50 బంతుల్లో 94 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) విశ్వరూపంతో కరీబియన్ల భరతం పట్టిన విషయం తెలిసిందే. 

చదవండి:
విరాట్‌ కోహ్లి సింహ గర్జన..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top