రికార్డు స్థాయి బిడ్‌.. తుది దశకు ఆర్సీబీ అమ్మకం! | RCB Sale Enters Final Stage With Price Set Around 2 Billion USD | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయి బిడ్‌.. తుది దశకు ఆర్సీబీ అమ్మకం!

Mar 18 2026 5:21 PM | Updated on Mar 18 2026 6:15 PM

RCB Sale Enters Final Stage With Price Set Around 2 Billion USD

విరాట్‌ కోహ్లీ (Courtesy: IPL 2025)

ఐపీఎల్లో 2025లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్‌గా నిలిచింది. అయితే 17 సీజన్ల పాటు కింగ్‌ఫిషర్‌ కంపెనీ నిర్వహిస్తూ వచ్చిన ఆర్బీబీ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్సీబీ అమ్మకం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. స్వీడన్‏కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ భారీ బిడ్ పెట్టినట్లు సమాచారం. 

మరోవైపు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత రంజన్ ‏పై, అమెరికా సంస్థ కోల్‌బెర్గ్‌ క్రావిస్‌ రాబర్ట్స్‌ అండ్‌ కో (కేకేఆర్‌), సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ టెమాసెక్ కలసిన కన్సార్టియం కూడా పోటీలో ఉంది.  కాగా మొత్తం డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ప్రారంభంలో మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమానులు గ్లేజర్స్, అదార్ పూనావాలా కూడా ఆసక్తి చూపినప్పటికీ చివరికి రేసు నుంచి తప్పుకున్నారు. 

గ్లేజర్స్ సుమారు 1.8 బిలియన్ డాలర్ల నాన్ బైండింగ్ ఆఫర్ ఇచ్చినట్లు, అయితే ఈక్యూటీ దాన్ని దాటేలా బిడ్ పెంచినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ డీల్ సూటిగా బిడ్డింగ్ పోరుగా మారింది. డయాజియో గ్రూప్ మార్చి 31ని గడువుగా పెట్టి ఈ అమ్మకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. 

ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడం వెనుక కూడా ఈ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మూడు సంస్థలు బైండింగ్ బిడ్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఫేవరెట్‏గా నిలుస్తోంది. మొదట మెజారిటీ వాటా అమ్మాలని భావించిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇప్పుడు పూర్తి విక్రయానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 

ఈ ఫ్రాంచైజీ విలువ 1.1 బిలియన్ నుంచి 1.35 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. రైన్ గ్రూప్ ఈ అమ్మక ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. అమెరికాకు చెందిన డేవిడ్ బ్లిట్జర్, ఆదిత్య బిర్లా గ్రూప్ కలిసి కన్సార్టియంగా బిడ్ సమర్పించినట్లు తెలుస్తోంది. మార్చి 31 ఈ డీల్ కూ కీలక గడువుగా ఉంది. 

అయితే ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు అభిమానులు చాలా మంది ఉంటారు. ఖరీదైన జట్టుగా పేరున్న ఆర్సీబీని దక్కించుకోవడానికి రెండు ప్రధాన సంస్థలు పోటీలో ఉన్నాయి. అంతిమంగా ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆర్‌సీబీ అమ్మకం ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

చదవండి: ఐపీఎల్‌ ఖరీదైన ఆటగాడి అసహనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement