ఇది కదా విజయమంటే..: కోహ్లి

IND Vs NZ: We Enjoyed This Game, Virat Kohli - Sakshi

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించడంపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆనందంలో మునిగితేలుతున్నాడు. తాము రెండు రోజుల క్రితమే ఇక్కడకు చేరుకున్నప్పటికీ ఈ తరహాలో ఆడి విజయం సాధించడం నిజంగా అద్భుతమన్నాడు.  అలసిపోయామని మాట ఎప్పుడూ చెప్పలేదని, అలా చెప్పడాన్ని కూడా తాము కోరుకోమన్నాడు. కేవలం తమ ముందున్న టార్గెట్‌  విజయం సాధించడమేనని కోహ్లి తెలిపాడు. ఈ గేమ్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఆడామన్నాడు. ఇదే తరహా ఆటను మిగతా మ్యాచ్‌ల్లో కూడా పునరావృతం చేస్తామన్నాడు. ఏడాది కాలంగా భారత జట్టు టీ20ల్లో కూడా రాటుదేలిందన్నాడు. (ఇక్కడ చదవండి: రోహిత్‌.. నువ్వు సూపరో సూపర్‌!)

ఈ పిచ్‌ పరుగులు చేయడానికి కష్టమైనది కాదని, తాము న్యూజిలాండ్‌ 230కి పరుగుల్ని టార్గెట్‌గా నిర్దేస్తుందని ముందుగా అనుకున్నామన్నాడు. కాకపోతే తమ బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్‌ను అంతకంటే తక్కువ పరుగులకే కట్టడి చేశామన్నాడు. ఇక తమకు లభించిన మద్దతు మరువలేనిదని కోహ్లి అన్నాడు. ఈ స్టేడియంలో 80 శాతం మద్దతు తమకే ఉందన్నాడు.  మ్యాచ్‌ తర్వాత మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. ‘ మేము ఓ దశలో కీలక వికెట్లను చేజార్చుకున్నాం. దాంతో మంచి భాగస్వామ్యం సాధించాలనే లక్ష్యంతో బ్యాటింగ్‌ చేశాను. ఇది చాలా చిన్న గ్రౌండ్‌. దాంతో పరుగులు చేస్తూనే ఉన్నాం. దాంతో 204 పరుగుల టార్గెట్‌ పెద్దదిగా అనింపిచలేదు’ అని పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: అయ్యర్‌ అదరహో.. )

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top