నార్త్ ఈస్ట్ సెమీస్ ఆశలు సజీవం | Inanimate hopes of a mix-up in the North East | Sakshi
Sakshi News home page

నార్త్ ఈస్ట్ సెమీస్ ఆశలు సజీవం

Dec 1 2016 12:43 AM | Updated on Oct 2 2018 8:39 PM

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టు తమ సెమీఫైనల్ అవకాశాలను ...

గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టు తమ సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ఢిల్లీ డైనమోస్ జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునెటైడ్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.

ప్రస్తుతం నార్త్ ఈస్ట్ జట్టు 18 పారుుంట్లతో ఐదో స్థానంలో ఉంది. నార్త్ ఈస్ట్ తరఫున సిత్యాసెన్ సింగ్ (60వ ని.లో), కోఫీ ఎన్‌డ్రి (71వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఢిల్లీ జట్టుకు పెరీరా (90వ ని.లో) ఏకై క గోల్ అందించాడు. గురువారం జరిగే మ్యాచ్‌లో ఎఫ్‌సీ గోవాతో చెన్నైరుున్ ఎఫ్‌సీ తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement