క్రికెట్ టోర్నీ ఫైనల్లో ఓక్రిడ్జ్ | In cricket tournment final Oakridge team | Sakshi
Sakshi News home page

క్రికెట్ టోర్నీ ఫైనల్లో ఓక్రిడ్జ్

Jan 31 2014 12:31 AM | Updated on Sep 2 2017 3:11 AM

మెరీడియన్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-12 క్రికెట్ టోర్నీలో ఓక్రిడ్జ్ అంతర్జాతీయ స్కూల్ (ఖాజాగూడ) జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది.

రాయదుర్గం, న్యూస్‌లైన్ : మెరీడియన్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-12 క్రికెట్ టోర్నీలో ఓక్రిడ్జ్ అంతర్జాతీయ స్కూల్ (ఖాజాగూడ) జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో ఓక్రిడ్జ్ జట్టు... మెరీడియన్ బంజారా జట్టుతో తలపడింది.
 
  10 ఓవర్ల ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మెరీడియన్ బంజారా జట్టు 78 పరుగులు చేసింది. ఓక్రిడ్జ్ జట్టు బౌలర్ రోహన్ 13 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఓక్రిడ్జ్ జట్టు 9.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓక్రిడ్జ్ జట్టులో క్రితిక్ 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జట్టు విజయానికి దోహదపడ్డాడు. ఫైనల్ పోరు శుక్రవారం జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement