క్రికెట్‌ పునరుద్దరణకు ఐసీసీ ప్రయత్నాలు

ICC Said Bowlers Would Need Minimum 2 Months Of Preparation - Sakshi

దుబాయ్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మార్చి చివరి వారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రికెట్‌ టోర్నీలు జరగలేదు. అయితే అనేక దేశాలు లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్న వేళ క్రికెట్‌ పునరుద్దరించాలిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) భావిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు వెంటనే మైదానంలోకి దిగితే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనేదానిపై ఐసీసీ అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో బౌలర్ల గురించే ఐసీసీ ఆందోళన చెందుతోంది. 

‘లాక్‌డౌన్‌ విరామంలో అనేక మంది ఆటగాళ్లు ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సమయంలో చిన్నపాటి వ్యాయామాలకే కొంత మంది ఆటగాళ్లు పరిమితమయ్యారు. చాలా గ్యాప్‌ తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి దిగితే గాయాలబారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బౌలర్ల గురించే మాకు ఎక్కువ ఆందోళనగా ఉంది. ఈ విరామం తర్వాత బౌలర్లకు సరైన శిక్షణ లేకుండా క్రికెట్‌ ఆడితే గాయాలబారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. 

అందుకే వారు టెస్టు క్రికెట్‌కు సంసిద్దం కావాలంటే కనీసం రెండుమూడు నెలలు, పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలంటే మూడు నుంచి నాలుగు వారాల సన్నాహక శిబిరాల్లో పాల్గొనాలి’ అంటూ ఐసీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అంతేకాకుండా ఆటగాళ్లను 14 రోజుల క్వారంటైన్‌, మైదానంలో భౌతిక దూరం, ఒకరి వస్తువులు మరొకరు వాడొద్దనే నిబంధనలను ఐసీసీ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

చదవండి:
‘కోహ్లి.. నీ భార్యతో కలిసి జత కట్టు’
నీకు.. 3డీ కామెంట్‌ అవసరమా?: గంభీర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top