‘కోహ్లి.. నీ భార్యతో కలిసి జత కట్టు’ | David Warner Invites Virat Kohli To A Duet On TikTok | Sakshi
Sakshi News home page

‘కోహ్లి.. నీ భార్యతో కలిసి జత కట్టు’

May 23 2020 12:42 PM | Updated on May 23 2020 1:05 PM

David Warner Invites Virat Kohli To A Duet On TikTok - Sakshi

డేవిడ్‌ వార్నర్‌-విరాట్‌ కోహ్లి(ఫైల్‌ఫొటో)

మెల్‌బోర్న్‌: లాక్‌డౌన్‌ సమయంలో ఆసీస్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ వినోదాన్ని పంచినట్లు మరే క్రికెటర్‌ పంచలేదంటే అతిశయోక్తి కాదేమో. ఒకవైపు లాక్‌డౌన్‌ సమయాన్ని ఆస్వాదిస్తూనే మరొకవైపు అభిమానులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నాడు వార్నర్‌.  వార్నర్‌ టిక్‌టాక్‌లో అరంగేట్రం చేసిన దగ్గర్నుంచి తనదైన శైలిలో దుమ్ముదులిపేస్తూ ఉన్నాడు. అటు తెలుగు, ఇటు తమిళే కాకుండా బాలీవుడ్‌ సాంగ్‌ల కూడా టిక్‌టాక్‌లు చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్‌ను తెచ్చుకున్నాడు వార్నర్‌. తాజాగా వార్నర్‌ చేసిన మరో టిక్‌టాక్‌ వీడియో అభిమానుల్ని తెగ అలరిస్తోంది. (నీకు.. 3డీ కామెంట్‌ అవసరమా?: గంభీర్‌)

2019లో అక్షయ్‌ కుమార్‌ హీరోగా వచ్చిన హౌస్‌ఫుల్‌-4 చిత్రంలోని ‘బాలా’ పాటకు వార్నర్‌ ఇరగదీశాడు. గతంలో పోస్ట్‌ చేసిన వీడియోలకు భిన్నంగా ఈ వీడియోలో కనిపించాడు. ఐదు ఫ్రేమ్‌ల్లో కనిపించిన వార్నర్‌ ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. దీన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. దీన్ని చూసిన భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నాలుగు లాఫింగ్‌ ఎమోజీలను పోస్ట్‌ చేసి అందులో ఎంత ఫన్‌ ఉందో వార్నర్‌కు తెలియజేశాడు.

దీనికి స్పందించిన వార్నర్‌.. ‘కోహ్లి నువ్వు కూడా టిక్‌టాక్‌లో నీ భార్యతో కలిసి జత కట్టొచ్చుకదా.. నీకు టిక్‌టాక్‌ అకౌంట్‌ను నీ భార్య క్రియేట్‌ చేస్తుందిలే’ అని పేర్కొన్నాడు. ఇటీవల అనుష్క శర్మ ఒక వీడియోను ట్వీటర్‌లో షేర్‌ చేసుకున్నారు. విరాట్‌ కోహ్లి మెల్లగా నడుచుకుంటూ వచ్చే క్రమంలో చేతులను ముందుకు వంచి ఒక జంతువు తరహాలో నటించాడు. దీనికి అనుష్క.. ఒక డైనోసార్‌ను కనుగొన్నా అనే క్యాప్షన్‌ ఇచ్చి షేర్‌ చేశారు. ఇది బాగా వైరల్‌ అయ్యింది. (ధోనిని ఏనాడు అడగలేదు: రైనా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement