'మళ్లీ టీమిండియాకు ఆడాలనుకుంటున్నా' | I hope to play for India again, Sreesanth | Sakshi
Sakshi News home page

'మళ్లీ టీమిండియాకు ఆడాలనుకుంటున్నా'

May 16 2015 10:37 AM | Updated on Sep 3 2017 2:10 AM

'మళ్లీ టీమిండియాకు ఆడాలనుకుంటున్నా'

'మళ్లీ టీమిండియాకు ఆడాలనుకుంటున్నా'

స్పాట్ ఫిక్సింగ్‌లో పట్టుబడి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్(33) మరోసారి టీమిండియాలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

ముంబై: స్పాట్ ఫిక్సింగ్‌లో పట్టుబడి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్(33) మరోసారి టీమిండియాలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నాడు.  ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కుని రెండేళ్ల జైలు జీవితం అనుభవించిన శ్రీశాంత్ తన క్రికెట్ పునరాగమనంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. గత ఐదు రోజుల క్రితం తండ్రిగా ప్రమోషన్ పొందిన శ్రీశాంత్ తన అభిప్రాయాన్ని మీడియాకు వెల్లడించాడు.

 

' నా కూతురు రాకతో మా జీవితంలో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది. నా అదృష్టం కూడా మారుతుందని ఆశిస్తున్నా. మళ్లీ టీమిండియాకు ఆడాలనేది నా కోరిక' అని శ్రీశాంత్ స్పష్టం చేశాడు. ఇంకా తన చిట్టితల్లికి పేరు ఖరారు చేయలేదని శ్రీశాంత్ పేర్కొన్నాడు. వచ్చే రెండు నెలల్లో పాపకు పేరు పెట్టే శుభకార్యం ఉండవచ్చని తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement