జూడో చాంపియన్‌షిప్‌ విజేత హైదరాబాద్‌ | Hyderabad Wins Judo championship Title | Sakshi
Sakshi News home page

జూడో చాంపియన్‌షిప్‌ విజేత హైదరాబాద్‌

Nov 11 2019 10:01 AM | Updated on Nov 11 2019 10:01 AM

Hyderabad Wins Judo championship Title - Sakshi

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్‌ జూడో చాంపియన్‌షిప్‌లో బాలికల విభాగంలో హైదరాబాద్‌ జట్టు విజేతగా అవతరించింది. బాలుర విభాగంలో మాత్రం హైదరాబాద్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. రెండు రోజులుగా జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో మానేరు విద్యాసంస్థల సౌజన్యంతో కరీంనగర్‌ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీలు ఆదివారం ముగిశాయి.

ఈ పోటీలకు తెలంగాణలోని 13 జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. బాలుర విభాగంలో వరంగల్‌ 33 పాయింట్లతో ఓవరాల్‌ టైటిల్‌ సాధించింది. హైదరాబాద్‌ 26 పాయింట్లతో ద్వితీయ స్థానం పొందింది. బాలికల విభాగంలో హైదరాబాద్‌ జట్టు 28 పాయింట్లతో చాంపియన్‌గా... వరంగల్‌ జట్టు 24 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాయి. విజేతలకు కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి ట్రోఫీలను అందజేశారు.  othe

Advertisement
 
Advertisement
Advertisement