ఒకే రోజు రెండు హ్యాట్రిక్స్‌తో కొత్త చరిత్ర! | history made in New Zealand’s Plunket Shield | Sakshi
Sakshi News home page

ఒకే రోజు రెండు హ్యాట్రిక్స్‌తో కొత్త చరిత్ర!

Mar 3 2018 1:14 PM | Updated on Mar 3 2018 1:20 PM

history made in New Zealand’s Plunket Shield - Sakshi

ఆక్లాండ్‌: ఆ ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదివారు.. ఆ ఇద్దరూ ఒకే జట్టుకి ప్రాతినిథ్యం కూడా వహించారు. అయితే ఆ ఇద్దరూ తాజాగా ఒకే రోజు హ్యాట్రిక్స్‌ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా నిజం. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరంటే న్యూజిలాండ్‌కు చెందిన క్రికెటర్లు లాగోన్‌ వేన్‌ బీక్‌, మ్యాట్‌ మెక్‌ ఇవాన్‌లు.


వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌ దేశవాళీ లీగ్‌లో భాగంగా ఫ్లంకెట్‌ షీల్డ్‌ ట్రోఫీలో వెల్లింగ్టన్‌ ఫైర్‌బర్డ్స్‌ ఆటగాడు వేన్‌ బీక్‌.. కాంటర్‌బరీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముందుగా హ్యాట్రిక్‌ సాధించాడు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో భాగంగా చివరి రెండు బంతులకి రెండు వికెట్లు సాధించిన వేన్‌ బీక్‌.. ఆరో ఓవర్‌ మొదటి బంతికి వికెట్‌ తీసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఇది ఫ్లంకెట్‌ షీల్డ్‌లో 40వ హ్యాట్రిక్‌గా పుస్తకాల్లోకెక్కగా, ఆపై అతని స్నేహితుడు మ్యాట్‌ వాన్‌ కూడా హ్యాట్రిక్‌ సాధించాడు. వేన్‌ బీక్‌ సాధించిన హ్యాట్రిక్‌ తరహాలో వాన్‌ వరుస మూడు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.

ఆక్లాండ్‌ తరపున ఆడిన ఇవాన్‌.. నార్త్‌రన్‌ డిస్ట్రిక్స్‌ జట్టు హ్యాట్రిక్‌ సాధించాడు. ఇన్నింగ్స్‌ 26 ఓవర్‌ ఆఖరి రెండు బంతుల్లో రెండు వికెట్లు సాధించగా, 28 ఓవర్‌ తొలి బంతికి మరో వికెట్‌ తీసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఇది ఇది ఫ్లంకెట్‌ షీల్డ్‌లో 41 హ్యాట్రిక్‌. ఫలితంగా 112 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఫ్లంకెట్‌ ఫీల్డ్‌లో రెండు హ్యాట్రిక్‌లు ఒకే రోజు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇంతకీ ఆ రెండు ‍హ్యాట్రిక్‌లు వచ్చింది శుక్రవారం. గతంలో ఇద్దరూ క్రికెటర్లు కాంటర్‌బరీ తరపున ఆడగా, క్రిస్ట్‌చర్చ్‌ సెయింట్‌ ఆండ్రూస్‌ కాలేజ్‌లో విద్యను అభ్యసించడం మరొక విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement