
న్యూఢిల్లీ:గత కొంతకాలంగా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా-ఒక మిస్టరీ గర్ల్ మధ్య ఏదో ఉందంటూ వస్తున్న వార్తలకు ఎట్టకేలకు పాండ్యా ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ మేరకు తాజాగా ఆ మిస్టరీ గర్ల్ ఎవరనే దానిపై ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చాడు. ఆ మిస్టరీ గర్ల్ తన చెల్లెలంటూ సోషల్ మీడియా వార్తలపై వివరణ ఇచ్చుకున్నాడు.
హార్దిక్ పేరుతో ఒక అభిమాని క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్ నుంచి ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో సదరు అమ్మాయి ఎవరంటూ ఫ్యాన్స్ తెగ తర్జన భర్జన పడ్డారు. ఆ క్రమంలోనే హార్దిక్ పక్కనే ఉన్న ఆ మిస్టరీ గర్ల్ ఎవరంటూ డీఎన్ఏ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు హార్దిక్ బదులిచ్చాడు. ఆ అమ్మాయి తన చెల్లెలంటూ దానికి ముగింపు పలికాడు.
Mystery solved! That's my sister
— hardik pandya (@hardikpandya7) 2 October 2017