గిల్‌క్రిస్ట్‌ నీ ఏడుపు ఆపు: భజ్జీ

Harbhajan Singh Slams Adam Gilchrist Over DRS Excuse - Sakshi

న్యూఢిల్లీ : ప్రస్తుత క్రికెట్‌ ప్రపంచంలో డీఆర్‌ఎస్‌ విధానం  ఎంత కీలకపాత్ర పోషింస్తుందో అందరికి తెలిసిందే. అంపైర్‌ పొరపాటుగా అవుట్‌ ఇచ్చినా బ్యాట్సమెన్‌ వెంటనే డీఆర్‌ఎస్‌ను కోరి సత్ఫలితాలు సాధిస్తున్నారు. అటు బౌలింగ్‌ చేసే జట్లు కూడా డీఆర్‌ఎస్‌ ద్వారా అనుకున్న ఫలితాలు సాధిస్తున్నాయి. తాజాగా విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా హ్యాట్రిక్‌ సాధించిన విషయం తెలిసిందే. కాగా, రెండో టెస్టు మ్యాచ్‌లో 44వ ఓవర్‌లో బుమ్రా వేసిన బంతిని కోహ్లి డీఆర్‌ఎస్‌ కోరడంతో బుమ్రా హ్యాట్రిక్‌ ఘనతను నమోదు చేశాడు.

తాజాగా ఆస్ట్రేలియన్‌ మాజీ వికెట్‌కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ట్విటర్‌లో స్పందిస్తూ ' తానూ ఆడే రోజుల్లో డీఆర్‌ఎస్‌ లేకపోవడం వల్లే  హర్భజన్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ సాధించాడని' పేర్కొన్నాడు. దీనిపై భజ్జీ స్పందిస్తూ 'ఆరోజు నువ్వు మొదటి బంతికే ఔటవ్వకపోతే ఎక్కువసేపు ఆడేవాడివి అనుకుంటున్నావా ? గిల్లీ ! ఇప్పటికైనా నీ ఏడుపు ఆపు.. నువ్వు ఆడిన రోజుల గురించి మాట్లాడడం నీకు సరైనదిగానే కనిపిస్తుంది. కానీ అప్పటి నిర్ణయాలు అయితే మారవు, దానికి నువ్వే ఉదాహరణ, ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావు అంటూ' భజ్జీ చురకలంటించాడు. ఈడెన్‌గార్డెన్‌ వేదికగా 2001లో ఆసీస్‌తో జరిగిన టెస్టులో  హర్భజన్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. 72వ ఓవర్‌లో వరుసబంతుల్లో రికీ పాంటింగ్‌, గిల్‌క్రిస్ట్‌, షేన్‌వార్న్‌లను ఔట్‌ చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top