సింగిల్స్‌ రన్నరప్‌ వృశాలి | gummadi vrushali runnerup in polish | Sakshi
Sakshi News home page

సింగిల్స్‌ రన్నరప్‌ వృశాలి

Sep 24 2018 7:04 AM | Updated on Sep 24 2018 10:17 AM

gummadi vrushali runnerup in polish - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలిష్‌ ఓపెన్‌ అంతర్జాతీయ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి గుమ్మడి వృశాలి రన్నరప్‌గా నిలిచింది. పోలాండ్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో వృశాలి 11–21, 14–21తో భారత్‌కే చెందిన రితూపర్ణ దాస్‌ చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్స్‌లో వృశాలి 23–21, 21–9తో ప్రిస్‌కిలా(జర్మనీ)పై, రితూపర్ణ 21–19, 21–11తో జోర్డాన్‌ హార్ట్‌ (వేల్స్‌)పై గెలుపొందారు. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్‌ హర్షీల్‌ డాని విజేతగా నిలిచాడు. ఫైనల్లో హర్షీల్‌ 21–19, 21–13తో నాలుగో సీడ్‌ లూ చియా హంగ్‌ (చైనీస్‌ తైపీ)పై విజయం సాధించాడు.  

Advertisement
 
Advertisement
Advertisement