గుజరాత్దే పైచేయి | Gujarat Still On Top In Irani Cup | Sakshi
Sakshi News home page

గుజరాత్దే పైచేయి

Jan 22 2017 8:25 PM | Updated on Sep 5 2017 1:51 AM

గుజరాత్దే పైచేయి

గుజరాత్దే పైచేయి

ఇరానీ కప్లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో గుజరాత్ పైచేయి సాధించింది.

ముంబై: ఇరానీ కప్లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో గుజరాత్ ఆధిపత్యం కొనసాగుతోంది. మూడో రోజు ఆటలో భాగంగా ఆదివారం ఆట ముగిసే సమయానికి గుజరాత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసి  పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో గుజరాత్ 358 పరుగులు చేయగా, రెస్టాఫ్ ఇండియా తన మొదటి ఇన్నింగ్స్ లో 226 పరుగులకు ఆలౌటైంది. దాంతో  గుజరాత్ కు 359 పరుగుల ఆధిక్యం సాధించింది.

206/9 ఓవర్ నైట్ స్కోరుతో ఈరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన రెస్టాఫ్ ఇండియా మరో 21 పరుగుల్ని జత చేసి ఆలౌటైంది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ ఆదిలోనే గోహెల్(1) వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో ప్రియాంక్ పాంచల్(73) ఆదుకోగా,రావల్(23), పార్థీవ్ పటేల్(32)లు ఫర్వాలేదనిపించారు. ఆపై చిరాక్ గాంధీ(55 బ్యాటింగ్)హాఫ్ సెంచరీ సాధించి క్రీజ్లో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement